: ఒక్క రోజులో రూ. 505 పెరిగిన బంగారం ధర


రెండు రోజుల క్రితం మూడు నెలల కనిష్ఠస్థాయికి చేరుకున్న బంగారం ధర, ట్రేడర్లు, స్టాకిస్టుల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో, ఏకంగా రూ. 505 పెరిగింది. స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ. 29,225కు చేరుకుంది. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో బులియన్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక వెండి ధర రూ. 400 పెరిగి మరోసారి రూ. 39 వేలను దాటింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.73 శాతం పెరిగి 1,243 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 2.69 శాతం పెరిగి 16.39 డాలర్లకు చేరింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ పతనం కూడా ధర పెరగడానికి కారణమని తెలుస్తోంది. తదుపరి సెషన్లలో బంగారం ధర మరింతగా పెరిగి రూ. 30 వేలను దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News