: ఒంగోలు కాదు కడప... మారిన మహాసంకల్పం వేదిక
ఈ నెల 8న చంద్రబాబు సర్కారు తలపెట్టిన మహాసంకల్పం వేదిక మారింది. తొలుత ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, దీన్ని కడపకు మార్చినట్టు తెలిపింది. నెల్లూరులో జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొని ప్రసంగించిన మంత్రి శిద్ధా రాఘవరావు, మహాసంకల్పం వేదికను ఒంగోలు నుంచి కడపకు మార్చినట్టు తెలిపారు. వ్యవసాయంపై పలువురు అధికారులతో సమీక్షించిన ఆయన, పంటకుంటలు, ఇంకుడు గుంతలపై మరింత పెద్దఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. గడచిన రెండు సంవత్సరాల్లో 3 వేల కొత్త బస్సులను ఆర్టీసీ కోసం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ బస్టాండులను ఆధునికీకరించామని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని శిద్ధా పేర్కొన్నారు.