: జగన్ యాత్రతో కదిరిలో మళ్లీ ఉద్రిక్తత... పోలీసుల లాఠీ చార్జ్
అనంతపురం జిల్లా కదిరిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కదిరిలో ఈ రోజు మూడుసార్లు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడం గమనార్హం. జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా కదిరిలో జగన్ ప్రసంగించిన అనంతరం వెళ్తున్న జగన్ కాన్వాయ్ కు అడ్డంగా రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు తొలగించే ప్రయత్నం చేయడంతో వారికి ... టీడీపీ నేతలు, కార్యకర్తలకు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారు రోడ్డుకు అడ్డంగా ఉండి కదలకపోవడంతో చివరికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.