: ఈ మెషీన్ ఇట్టే ఇస్త్రీ చేసేస్తుంది!


బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్ ఉన్నట్టే, ఇప్పుడు వాటిని ఇస్త్రీ చేయడానికి కూడా ఓ మెషిన్ వచ్చింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ 'ఫోల్డీమెట్' పేరుతో ఓ రోబోటిక్ లాండ్రిని ఆవిష్కరించింది. దీనికి ఉన్న హ్యాంగర్లకు ఉతికిన బట్టలు తగిలించి, ఏ రకమైన బట్టలు ఉంచామో అందుకు సంబంధించిన బటన్ నొక్కితే చాలు, ఇది వాటిని ఇస్త్రీ చేసేస్తుంది. ఇస్త్రీకి 15 నుంచి 20 సెకెన్లు, వాటిని మడతపెట్టడానికి 10 సెకెన్ల సమయం పడుతుందని ఆ సంస్థ తెలిపింది. 32 అంగుళాల ఎత్తు, 28 అంగుళాల వెడల్పు, 30 కేజీల బరువుండే ఈ రోబోటిక్ మెషీన్ ను ఇంట్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చని తయరీదారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కమర్షియల్ గానే అందుబాటులో ఉన్న ఈ మెషీన్ ను, 2017 నాటికి ఇళ్లలో వాడుకునే విధంగా కూడా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News