: జగన్ పర్యటనలో ఉద్రిక్తత...పోలీసుల అప్రమత్తత!


అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన యాత్ర నాలుగోరోజులో రెండోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కదిరిలో జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలతో కలసి బయల్దేరారు. కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, జగన్ మరోసారి చంద్రబాబుపై నోరు జారితే ప్రత్యక్ష దాడులకు దిగుతామని అన్నారు. జగన్ ప్రజలను ఎలా ఉసిగొల్పుతున్నాడో అదే రీతిలో సన్మానం తాను చేస్తానని ఆయన తెలిపారు. కాగా, ఈ నేపథ్యంలో వారిని దీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిధ్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడెలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News