: చంద్ర‌బాబుపై జ‌గ‌న్ ఈర్ష్య, ద్వేషంతో ఉన్నారు: జలీల్‌ఖాన్‌


వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ స్పందించారు. ఈరోజు విజ‌య‌వాడ‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ ఈర్ష్య, ద్వేషంతో ఉన్నార‌ని అన్నారు. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు ఎన్న‌డూ చేయ‌లేద‌ని జ‌లీల్ ఖాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్‌ పెద్ద‌ల ప‌ట్ల కొంచం కూడా గౌరవంగా ప్ర‌వ‌ర్తించ‌ర‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ విధానాల‌ వల్లే వైసీపీని ఎమ్మెల్యేలంద‌రూ వీడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News