: ఈ రోజు వద్దు, ఎల్లుండి రండి..!: హరీశ్ రావుకి ఉమాభారతి ఫోన్!
ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ మంత్రి హరీశ్‌రావు బృందం ప్రయాణం వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కేంద్రం ముందు ఉంచాల్సిన అంశాలపై మంత్రి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయమై ఈరోజు హరీశ్ రావు కేంద్రమంత్రి దత్తాత్రేయని, గవర్నర్ నరసింహన్‌ని కూడా కలిశారు. మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి కేంద్ర మంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్ తమ సాగునీటి ప్రాజెక్టులపై అనుసరిస్తోన్న తీరు, నదీ జలాల వాటా తదితర అంశాలు చర్చించాలనుకున్నారు. అయితే, కొద్ది సేపటి క్రితం హరీశ్‌రావుకి ఫోన్ చేసిన కేంద్ర మంత్రి ఉమాభారతి సంబంధిత అధికారులు ఈరోజు అందుబాటులో లేరని, తమ పర్యటనను ఎల్లుండికి వాయిదా వేసుకోమని కోరారు. దీంతో ఆయన తన పర్యటనను సోమవారానికి వాయిదా వేసుకున్నారు.