: కాగ్ చెప్పిన లెక్క‌ల ఆధారంగానైనా రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ చేయాలి: మ‌ంత్రి య‌న‌మ‌ల


త‌మ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ ప్ర‌జాప్ర‌యోజ‌నాల అంశంలో ఏ మాత్రం వెన‌క్కు వెళ్ల‌బోద‌ని ఏపీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు. రెవెన్యూలోటు పూర్తిస్థాయి భర్తీకి కేంద్రంతో సంప్రదిస్తూనే ఉన్నామ‌ని ఆయ‌న ఈరోజు ఓ టీవీ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇస్తోంద‌న్న విష‌యాన్ని తాను కొన్ని రోజుల క్రితం మీడియాలో చెప్పిన‌ట్లు గుర్తు చేశారు. రూ.6 వేల కోట్లు మాత్రమే ఇస్తే ఇబ్బందులు ప‌డ‌తామ‌ని అన్నారు. ఏపీకి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు అన్నది ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన లెక్క కాదని, విభజన సమయంలో నాటి ప్రభుత్వమే ఈ అంశాన్ని తేల్చి చెప్పింద‌ని యనమల వ్యాఖ్యానించారు. ‘కాగ్ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటుని భర్తీ చేస్తామని జైట్లీ చెప్పారు. కాగ్ రూ.15వేల కోట్లు రెవన్యూ లోటుగా నిర్ధారించింద’ని, కాగ్ చెప్పినట్లైనా రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ చేయాలని ఆయ‌న కేంద్రాన్ని కోరారు.

  • Loading...

More Telugu News