: జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉండ‌డం మ‌న కర్మ‌.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తారా..?: ఆనం వివేకా


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి స్పందించారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ‘జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉండ‌డం మ‌న కర్మ’ అని ఆయ‌న అన్నారు. ‘రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తారా..?’ అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ సంస్కార హీన‌త‌కు ఆయ‌న మాట‌లే నిద‌ర్శ‌నమ‌ని ఆనం వివేకా అన్నారు. తెలుగు రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ భ్ర‌ష్టు ప‌ట్టించారని ఆనం వివేకా అన్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం పెట్టుకున్నారని ఆ న‌మ్మ‌కాన్ని పోగొట్టొద్ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘ఏడాదిన్న‌ర జైల్లో ఉన్న నీవు సీఎం ప‌ద‌వికి పోటీ దారుడివా..? నువ్వేమైనా స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్లావా..? నీవ‌ల్ల వ్యాపార వేత్త‌లు, ఐఏఎస్‌లు కూడా జైలుకి వెళ్లారు’ అని ఆయ‌న జ‌గ‌న్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘ల‌క్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్ప‌డింది ఎవ‌రో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News