: ఏపీ సీఎంను కలసి కృతజ్ఞతలు చెప్పిన సురేశ్ ప్రభు


కేంద్ర రైల్వే శాఖ మంత్రి, బీజేపీ నేత సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. టీడీపీ నేత, మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి వచ్చిన సురేశ్ ప్రభు... చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా తనను ఏపీ కోటా నుంచి రాజ్యసభకు పంపినందుకు ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ఏపీ ప్రతినిధిగా ఉన్న తాను రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను కేంద్రం నుంచి విడుదల చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News