: పునాదులు లేని భవనం వైసీపీ... జగన్ కు మతి భ్రమించిందంటున్న గంటా


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతల ఎదురుదాడి కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం సాగర నగరం విశాఖలో మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని పునాదులు లేని భవనంగా అభివర్ణించిన గంటా... ఆ భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయం జగన్ ను వెంటాడుతోందన్నారు. వైసీపీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలు వరుస కట్టి పార్టీని వీడుతుండటంతో జగన్ కు మతి భ్రమించిందని ఆయన విమర్శించారు. ఈ కారణంగానే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్న జగన్... చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ మానసిక పరిస్థితి బాగా లేదని కూడా గంటా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News