: వైర్‌లెస్ ఛార్జ‌ర్ ‘ఎనర్జీ స్క్వేర్’.. తీర‌నున్న స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ క‌ష్టాలు


ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. మొదట్లో టెలిఫోన్... ఇప్పుడు మొబైల్ ఫోన్... టెక్నాల‌జీ అన్నది ఒక్క‌చోటే ఆగిపోదు. అది ఉన్న చోటు నుంచి మ‌రింత ఉన్న‌త దిశ‌గా ముందుకు సాగుతూనే ఉంటుంది. సెల్ ఫోన్ల‌లో ఛార్జింగ్ ఎక్కించ‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం వైర్ ఉన్న ఛార్జర్ నే ఉప‌యోగిస్తున్నాం. అయితే త్వ‌ర‌లోనే వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాల‌జీ అందుబాటులోకి రానుంది. 'ఎనర్జీ స్క్వేర్' పేరుతో ఈ ఛార్జ‌ర్ త్వ‌ర‌లో వినియోగ‌దారుల చెంత‌కు రానుంది. దీనితో స్మార్ట్ ఫోన్‌ల‌నే కాదు ట్యాబ్‌ల‌ను సైతం ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఎక్క‌డి కెళ్లినా ఈ వైర్‌లెస్ ఛార్జ‌ర్‌ని సులువుగా తీసుకెళ్లొచ్చు. ఈ వైర్లెస్ చార్జింగ్ మ్యాట్తో ఓ స్టిక్క‌ర్ ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఫోన్ కు చెందిన ఛార్జింగ్ సాకెట్‌లో ఈ స్టిక్క‌ర్ ను ఉంచి, స్మార్ట్ ఫోన్‌ను మ్యాట్‌పై పెట్టాలి. అంతే మ‌న మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ మ్యాట్ మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఒకేసారి ఐదు స్మార్ట్ ఫోన్ల‌ను ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు. కండక్టీవ్ చార్జింగ్ టెక్నాలజీని ఉప‌యోగించి ఈ ఛార్జింగ్ మ్యాట్ ను రూపొందిస్తున్నారు. వ‌చ్చేనెల‌లో మార్కెట్లోకి రానున్న ఈ ఛార్జింగ్ మ్యాట్ దానిలోని కండ‌క్టివ్ డాట్స్ మొబైల్ బ్యాట‌రీకి లింక్ అయ్యేలా ఉంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్లకు ఛార్జింగ్ ఎక్కుతుంది.

  • Loading...

More Telugu News