: కృష్ణా రివర్ బోర్డ్ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది.. ఢిల్లీలో ఫిర్యాదు చేయనున్న నేపథ్యంలో దత్తన్నతో హరీశ్ భేటీ
తెలంగాణ నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ రాజకీయ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన మంత్రి హరీశ్ రావు కేంద్రమంత్రి దత్తాత్రేయతో భేటీ అయ్యారు. ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై హరీశ్ రావు దత్తాత్రేయకి వివరించారు. తెలంగాణ నీటి వాటా, కృష్ణా రివర్‌బోర్డు సమస్యలపై దత్తాత్రేయకు తెలిపారు. కృష్ణా రివర్ బోర్డ్ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ సమస్యలపై దత్తన్న కూడా స్పందించాలని హరీశ్ కోరారు. అక్రమ ప్రాజెక్టులంటూ వస్తోన్న విమర్శలు, వాటికి గల కారణాలపై హరీశ్ రావు దత్తాత్రేయకు వివరించినట్లు తెలుస్తోంది. దత్తాత్రేయను కలిసిన వారిలో హరీశ్ రావుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. నిన్న కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినేట్ సమావేశంలో ఏపీపై ఢిల్లీలో ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.