: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరోమారు భూప్రకంపనలు... రాత్రంతా రోడ్లపైనే జనం


ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు, ప్రకాశం జిల్లాలను భూ ప్రకంపనల భయం వీడటం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా నిన్న రాత్రి 9.35 గంటల సమయంలో ఆ రెండు జిల్లాల్లోని పలు మండలాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, కొండాపురం, దుత్తలూరు, వరికుంటపాటు, సీతారామపురం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాలతో పటు ప్రకాశం జిల్లాలోని పామూరు, లింగసముద్రం, సీఎస్ పురం మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత తిరిగి ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డ జనం రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు.

  • Loading...

More Telugu News