: యాడికి నుంచి కదిరికి మారిన హైటెన్షన్!... టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మొన్న రాత్రి అనంతపురం జిల్లాలో నెలకొన్న హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నంతా జిల్లాలోని యాడికిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, తాజాగా ఆ పరిస్థితులు అదే జిల్లాలోని కదిరికి మారాయి. జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేడు కదిరి నియోజకవర్గంలో జరగనుంది. నిన్న రాత్రికే జగన్ కదిరి చేరుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం రంగంలోకి దిగిన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో కలిసి రోడ్డెక్కారు. చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెబితేనే యాత్రను కొనసాగనిస్తామని కందికుంట కదిరిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను ముట్టడించే యత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కందికుంట వర్గీయులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత చేయి దాటి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News