: రాష్ట్ర విభజన పాపంలో బీజేపీకీ పాత్ర!... మిత్రపక్షంపై అచ్చెన్న ఘాటు వ్యాఖ్య!
మిత్రపక్షం బీజేపీపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన పాపంలో బీజేపీకి కూడా పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా నిన్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సందర్భంగా అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు రాజ్యసభలో చేసిన ప్రసంగం ఏమిటి? ఏ సూచనలు చేశారు? ఇప్పుడు మీకు అధికారం వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఏంటి?’’ అని అచ్చెన్న బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.