: కార్పొరేటర్ జాస్తి సాంబశివరావును పరామర్శించిన చంద్రబాబు
వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా గాయపడ్డ విజయవాడ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావును సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. స్వల్పగాయాల కారణంగా విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో చంద్రబాబు మాట్లాడారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న ఆధ్వర్యంలో జగన్ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో, అక్కడే ఉన్న సాంబశివరావుకు గాయాలయ్యాయి.