: తప్పదు... అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందే: సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని, కష్టకాలంలో అందరూ కలిసిరావాలని ఆయన సూచించారు. కాగా, ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.