: యూపీఏని విమర్శించారు, మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి?: బీజేపీని ప్రశ్నించిన 'ఆప్'


గోవాను ఇద్దరు పరిపాలిస్తున్నారని ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ ఆరోపించారు. పనాజీలో ఆయన మాట్లాడుతూ, గోవా పరిపాలన వ్యవహారాల్లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తలదూర్చడం మానుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉండాల్సిన పారికర్ పఠాన్ కోట్ ఘటన చోటుచేసుకున్నప్పుడు, తాజాగా పుల్గావ్ పేలుడు చోటుచేసుకున్నప్పుడు ఆయన గోవాలోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. 'గోవాను ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తో పాటు పారికర్ కూడా పరిపాలిస్తున్నారని అంటున్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఫైళ్ల క్లియరెన్స్ కోసం అధికారులు ప్రధానిని పక్కనబెట్టి సోనియాను కలుస్తున్నారని బీజేపీ ఆరోపించేదని అన్నారు. మరి, గోవాలో ఇప్పుడు సీఎంగా పర్సేకర్ ఉన్నప్పటికీ క్యాంపు కార్యాలయంలో పారికర్ ను సీఎస్, ఇతర ఉన్నతాధికారులు కలసి చర్చిస్తున్నారని, మరి ఇది ఏ సంప్రదాయమని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News