: జగన్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అపశ్రుతి...టీడీపీ కార్పొరేటర్ కు గాయాలు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దహనం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడలో ఈ సంఘటన జరిగింది. జగన్ దిష్టబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించగానే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దిష్టిబొమ్మకు సమీపంలోనే ఉన్న కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుకు ఆ మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సాంబశివరావుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.