: వైఎస్ జ‌గ‌న్‌పై కడప, పుట్టపర్తి పోలీస్ స్టేషన్లలో కేసులు


తాను చేస్తోన్న‌ రైతు భరోసా యాత్రలో భాగంగా నిన్న‌ అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఈరోజు ఏపీ మంత్రుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈ క్రమంలో, కొద్ది సేప‌టి క్రితం జగన్ పై కేసు నమోదయింది. అనంతపురంలోని పుట్టపర్తి పోలీస్ స్టేషన్ లో జగన్ పై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ ఇదే అంశంపై జగన్ పై కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News