: ఐదు రోజులు... ఐదు దేశాలు...మోదీ పర్యటన వివరాలివే!
ఐదు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రేపు బయల్దేరనున్నారు. ఐదు రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో ఆయన ఆద్యంతం బిజీబిజీగా గడపనున్నారు. తొలుత ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్థాన్ వెళ్తారు. అక్కడ భారత నిధులతో నిర్మించిన సల్మా డ్యామును ప్రారంభించనున్నారు. అనంతరం ఖతార్ వెళ్తారు. అక్కడ ఆదివారం పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం స్విట్జర్లాండ్ చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వాధినేతలతో బ్లాక్ మనీని వెనక్కి తెచ్చే విషయంపై చర్చలు జరుపుతారు. అనంతరం ఈ నెల 6న వాషింగ్టన్ వెళ్తారు. తరువాతి రోజు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమవుతారు. ఆయనతో విందు అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. ఈ నెల 8న మెక్సికో వెళ్తారు. అదే రోజు రాత్రి ఆయన తిరిగి భారత్ కు బయల్దేరుతారని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తెలిపారు.