: 700 మందితో పడవ బోల్తా... 250 మందిని రక్షించామంటున్న భద్రతా దళాలు
మధ్య ప్రాచ్య దేశాల నుంచి వలసలు ఆగడం లేదు. అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని దేశాలు దాటిపోయేందుకు ప్రయత్నస్తూ మృత్యువాత పడుతున్నారు. తాజాగా 700 మంది శరణార్ధులతో వెళ్తున్న పడవ గ్రీక్ ద్వీపం వద్ద బోల్తా పడింది. దీనిపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సత్వరమే స్పందించినప్పటికీ కేవలం 250 మందిని మాత్రమే రక్షించగలిగామని, వందలాది మంది గల్లంతయ్యారని వారు చెప్పారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. దీనిపై మరింత సమచారం అందాల్సి ఉంది.