: ‘ఆంధ్రా’కు వెళ్లనంటూ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
డిప్యుటేషన్ పై ఆంధ్రాకు వెళ్లి తాను ఉద్యోగం చేయలేనని, తెలంగాణలోనే ఉంటానంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని అగ్రికల్చరల్ కమిషనర్ కార్యాలయం ఎదుట సదరు ఉద్యోగి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉద్యోగిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి చక్కబడింది. తనను ఆంధ్రాకు పంపవద్దని ఆ ఉద్యోగి విజ్ఞప్తి చేశాడు.