: మ‌రో వివాదంలో క‌ర్ణాట‌క సీఎం సిద్ధరామ‌య్య‌


క‌ర్ణాట‌క సీఎం సిద్ధరామ‌య్యను మ‌రో వివాదం చుట్టుముట్టింది. బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ)కు స్టివార్డ్‌గా ఓ వ్య‌క్తిని నామినేట్ చేయ‌డంతో తాజాగా ఆయ‌న మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ) స్టివార్డ్‌గా నామినేషన్ వేసిన ఎల్.వివేకానందతో సిద్ధరామ‌య్యకు లావాదేవీలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వినపడుతున్నాయి. దీనిపై సామాజిక కార్యకర్త ఎస్.భాస్కరన్ పలు ఆధారాలను సంపాదించి స్పందించారు. కర్ణాటక గవర్నర్ ఈ వ్య‌వ‌హారంపై జోక్యం చేసుకోవాల‌ని ఎస్.భాస్కరన్ కోరారు. వివేకానంద, సీఎం సిద్ధరామయ్య మ‌ధ్య 1.3కోట్ల రూపాయ‌ల లావాదేవీలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్ కమిటీ స్టివార్డ్‌గా వివేకానంద నామినేట్ అయిన కొద్ది రోజుల‌కే సిద్ధరామయ్య ఆయ‌న నుంచి రూ.1.3కోట్ల రుణం తీసుకున్నార‌ని బాస్క‌ర‌న్ పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. దీనికి సంబంధించిన ప‌లు ఆధారాల‌ను ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ కు స‌మ‌ర్పించారు. ఈ విష‌య‌మై వివేకానంద స్పందిస్తూ.. సీఎంతో ఎటువంటి లావాదేవీలు జ‌ర‌గ‌లేద‌ని, త‌మ‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని అన్నారు. త‌నను సిద్ధరామయ్య నామినేట్ చేసిన అనంత‌రం త‌న వ‌ద్ద రుణం తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల్ని ఆయ‌న ఖండించారు.

  • Loading...

More Telugu News