: బాలకృష్ణకు మెంటల్ అని ఐదు ఆసుపత్రులు ఇచ్చిన నివేదికలు చూపిస్తాం: వైకాపా నేత జోగి రమేశ్


విజయవాడ వేదికగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, రాజకీయ వ్యభిచారం చేస్తున్న చంద్రబాబునాయుడి మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని, ఆయన తను చెప్పిన విషయాన్ని గంటలోనే మరచిపోతున్నారని వైకాపా నేత జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలంతా ఒకరి తరువాత ఒకరు జగన్ ను విమర్శిస్తుంటే, వైకాపా నేతలు కూడా అదే దారిలో కదిలారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన జోగి రమేశ్, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, సోదరుడు రామ్మూర్తి నాయుడుల మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అన్నారు. బాలకృష్ణ పరిస్థితి మరీ దారుణమని, ఈ విషయంలో ఐదు ఆసుపత్రులు గతంలో ఇచ్చిన రిపోర్టులను తాము చూపిస్తామని అన్నారు. తమ నేతపై బురద జల్లడం మాని ప్రజలకు పథకాలను దగ్గర చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వేజోన్, హోదా అంశాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని, రాజ్యసభ సీట్లను కోట్ల రూపాయలకు అమ్మేసుకుని, బడుగులకు తీవ్ర అన్యాయం చేశారని రమేశ్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News