: సమాజం తులసి వనం... జగన్ ఓ గంజాయి మొక్క!: వర్ల రామయ్య కౌంటర్


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిన్నటి నుంచే టీడీపీ శ్రేణుల ఎదురు దాడి ప్రారంభమైంది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం విజయవాడ కేంద్రంగా మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య... జగన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సమాజమనే తులసి వనంలో జగన్ ఓ గంజాయి మొక్కగా పరిణమించారని వర్ల వ్యాఖ్యానించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ సంస్కారహీనుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ తన భాషను మార్చుకోకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News