: హైదరాబాద్‌లో 110 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యం
హైదరాబాద్ నగరంలో 110 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యమైంది. ఉన్నట్టుండీ తమ బామ్మ అదృశ్యం కావడంతో శతాధిక వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన నాలుగు తరాలను కళ్లతో చూసి, ఎన్నో ప్రాచీన విషయాలను తమతో పంచుకున్న బామ్మ కనిపించకుండా పోవడంతో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ బామ్మను ఎలాగైనా తమ వద్దకు తిరిగివచ్చేలా చూడాలని పోలీసులని కోరారు. శతాధిక వృద్ధురాలు కనిపించకుండా పోవడంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తామని తెలిపారు.