: అహోబిలంలో హైటెన్షన్!... ఈవో ఇంటికి నిప్పు, కార్యాలయంపై రాళ్లు రువ్విన స్థానికులు


కర్నూలు జిల్లా అహోబిలంలో మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలయ సమీపంలోని దుకాణాల తొలగింపునకు సంబంధించి రాజుకున్న వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆలయ అధికారుల చర్యలను అడ్డుకునే క్రమంలో రంగంలోకి దిగిన స్థానికులు ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) ఇంటిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈవో ఇంటికి నిప్పు పెట్టారు. అంతటితో ఆగని ఆందోళనకారులు ఈవో కార్యాలయంపైనా దాడికి దిగారు. కార్యాలయంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఈవో కార్యాలయం, ఇంటిపైనే దాడి జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News