: రెండేళ్లలో ఏం చేశాం?... ఇంకేం చేయాలి?: నేటి కేబినెట్ భేటీలో కేసీఆర్ కీలక సమీక్ష
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక భేటీ కానుంది. నేటి మధ్యాహ్నం హైదరాబాదులోని సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో... తన రెండేళ్ల పాలనపై కేసీఆర్ కీలక సమీక్ష చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నిన్నటికి రెండేళ్లు పూర్తైంది. గడచిన రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్తులో మరేం చేయాలి? అన్న కోణంలో సమీక్షించనున్న కేసీఆర్... ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు నుంచి వెలువడనున్న నిర్ణయాలపై తెలంగాణవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.