: హైదరాబాదులో సోనియాగాంధీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. హైదరాబాదు, ఎల్బీనగర్ లోని రాజీవ్ గాంధీవిగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.