: మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న టీచర్‌కి గాయాలు
ప్రమాదాల బారి నుంచి తప్పించుకునే విధానాన్ని చేసి చూపిస్తుండగా ఓ ఉపాధ్యాయురాలు ప్రమాదానికి గురైన ఘటన ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు భవనంలో చిక్కుకున్న వారు అక్కడి నుంచి ఎలా కిందికి రావాలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు చేసి చూపిస్తున్నారు. దీనిలో భాగంగా మాక్‌డ్రిల్‌లో పాల్గొంటోన్న ఉపాధ్యాయురాలు నాలుగంతస్తుల భవనంపై నుంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కిందకు దిగుతోన్న క్రమంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మాక్‌డ్రిల్ సందర్భంగా తీస్తోన్న వీడియోలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. గాయపడిన ఉపాధ్యాయురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.