: ఆక్సిజన్ సరిపోదని, గుండె జబ్బు బాలుడుని అడ్డుకున్న ఎయిరిండియా సిబ్బంది!


ఎయిరిండియా సిబ్బంది నిర్వాకం గుండె జబ్బుతో బాధపడుతున్న బాలుడ్ని ఇబ్బందులకు గురి చేసింది. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ఎక్కేందుకు జస్‌ రాజ్‌ సింగ్‌ సైని అనే 11 ఏళ్ల బాలుడిని బంధువులు తీసుకువచ్చారు. బాలుడు అమెరికాలో ఓ స్పెషలిస్టు వైద్యుడిని కలిసేందుకు జూన్‌ 2న అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు. పరీక్షల అనంతరం జూన్‌ 6న అతనికి సర్జరీ జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో జస్ రాజ్ సింగ్ సైనీ ఎయిర్ పోర్టు చేరుకున్నాడు. విమానం ఎక్కేందుకు రెడీ అవుతున్న బాలుడ్ని విమాన సిబ్బంది అడ్డుకున్నారు. విమానంలో తగినంత ఆక్సిజన్‌ లేదని చెప్పారు. అదేంటీ, సిబ్బందికి రెండు రోజుల ముందుగానే తమ ప్రయాణం గురించి చెప్పాము కదా, వారు నిర్ధారించిన తరువాతే ఏర్పాట్లన్నీ చేసుకుని బయల్దేరామని, ఇప్పుడిలా అభ్యంతరం చెప్పడం సరికాదని వారు సిబ్బందితో అన్నారు. అయితే బాలుడి కంటే ముందుగా ఓ 75 ఏళ్ల వ్యక్తిని విమానం ఎక్కించుకున్నామని.. 17 గంటల సుదీర్ఘ ప్రయాణంలో ఇద్దరికి సరిపడ ఆక్సిజన్‌ సిలిండర్లను విమానంలో తీసుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిపై విమానాశ్రయ ఉన్నతాధికారులకు అతని బంధువులు ఫిర్యాదు చేశారు. వారు కూడా సిబ్బందికి వంతపాడి, రేపు పంపిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో వారంతా వైద్యుడి అపాయింట్‌ మెంట్‌ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జస్ రాజ్ సింగ్ ను నేడు విమానంలో అమెరికా పంపారు.

  • Loading...

More Telugu News