: చంద్రబాబుగారూ! మీ కుటుంబసభ్యులు ప్రతిజ్ఞ చేశారా?: వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ


నవ నిర్మాణ దీక్షకు సంబంధించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు సరే, ఇంతకీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రతిజ్ఞను దేశ పౌరులుగా చేయించాలి గానీ, రాష్ట్ర పౌరులుగా కాదని అన్నారు. నవ నిర్మాణ దీక్షకు సంబంధించిన జీవోపై రాజద్రోహం కేసు పెట్టొచ్చంటూ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను గోబెల్స్ భవన్ గా మార్చుకోవాలని, కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాష్ట్రానికి అన్యాయమే చేశాయని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News