: కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెట్టేందుకు నేను రెడీ: నాగం జనార్దన్ రెడ్డి


కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెట్టడానికి తాను రెడీగా ఉన్నానని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల మధ్య నిద్రపోతానని నాడు చెప్పిన కేసీఆర్, నేడు ప్రాజెక్టుల అంచనాలను పెంచి అవినీతిని తారస్థాయికి పెంచేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు మద్దతు ఇచ్చిన పార్టీలను సీఎం కేసీఆర్ మరిచారన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ పేర్లను కేసీఆర్ ప్రస్తావించకపోవడంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ, ఇతర పార్టీల మద్దతు లేకుంటే ‘తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?’అని ఆయన ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ కుటుంబం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల మీటింగ్ కు అనుమతించకపోవడం దారుణమని, ఇతర రాజకీయపార్టీలను అణగతొక్కడమే కాకుండా, పత్రికా స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్నారంటూ కేసీఆర్ పై నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు

  • Loading...

More Telugu News