: గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ.59.65 మాత్రమే!
పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటుంటే, గోవాలో మాత్రం తగ్గిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా సామాన్యుడిపై పెట్రో భారాన్ని మోపుతుంటే, గోవా ప్రభుత్వం మాత్రం బావుల్లో తగ్గిన చమురు ధరల ప్రయోజనం బంకుల్లో కూడా అందాలని అంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 20 శాతం నుంచి ఒక్కసారిగా 15 శాతానికి తగ్గించింది. రాష్ట్ర ప్రజలకు లీటరు పెట్రోల్ ధరను రూ.60కు దిగువన అందిస్తామని అప్పటి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, అన్న మాట ప్రకారం వ్యాట్ తగ్గించి గోవా ప్రజలకు పెట్రో భారాన్ని తగ్గించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ. 2.58 పెంచగా, హైదరాబాద్ లో లీటరు ధర రూ. 69.91కు చేరుకుంది. ఇటువంటి సమయంలో గోవా ప్రజలకు లీటరు పెట్రోల్ ధర రూ.60లోపే అందడం విశేషం.