: కేఈకి డిప్యూటీ సీఎం పోస్టిచ్చారుగా!... విమర్శలను పట్టించుకోనన్న టీజీ వెంకటేశ్!
తనకు రాజ్యసభ టికెట్ లభించడాన్ని నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కర్నూలులోని సొంత పార్టీ కార్యాలయం ముట్టడికి వెళ్లిన ఘటనపై ఆ పార్టీ నేత టీజీ వెంకటేశ్ ఘాటుగా స్పందించారు. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీలో కేఈ ప్రభాకర్ సోదరుడు కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది కదా? అంటూ ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. బీసీలకు ఇంతకంటే ఏం చేయాలన్న రీతిలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభివృద్ధికి తాను కృషి చేయలేదా? అని కూడా టీజీవీ ప్రశ్నించారు.