: ఆవిర్భావ జోష్!... స్టెప్పులతో సంబరాలు చేసుకున్న ఈటల, మల్లారెడ్డి!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సంబరాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సందడి చేశారు. డోలు చేతబట్టిన ఈటల... ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు, బొడిగే శోభ, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులతో కలిసి స్టెప్పులేశారు. ఇక మల్కాజిగిరి పరిధిలోని న్యూబోయిన్ పల్లి లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఎంపీ మల్లారెడ్డి కూడా చిందేశారు. గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు కూడా మల్లారెడ్డితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు.

  • Loading...

More Telugu News