: 2002 గుజరాత్ అల్లర్ల కేసు: 24 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు
గుజరాత్‌లో 2002లో చెలరేగిన గుల్బర్గ్ సొసైటీ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది. సుదీర్ఘ విచారణ జరిపి ఘర్షణలు చెలరేగిన 14ఏళ్ల తరువాత ఈరోజు కోర్టు తీర్పునిచ్చింది. విచారణను ఎదుర్కొంటోన్న వారిలో 24 మందిని దోషులుగా నిర్ధారించింది. మరో 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దేశంలో చెలరేగిన తీవ్ర మత ఘర్షణల్లో ఒకటిగా ఈ కేసుపై వాదోపవాదాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. కేసుపై సుప్రీంకోర్టు గతంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు కూడా అనుమతినిచ్చి, మే31 వరకు విచారణ పూర్తి చేయాలని, అనంతరం తీర్పు వెలువరించాలని గడువు విధించింది.