: ప్రతి రూపాయీ అడుక్కునే పరిస్థితి ఉండేది, ఇప్పుడు మ‌న నిధులు మ‌న‌మే ఖ‌ర్చు చేస్తున్నాం: కేసీఆర్‌


తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మువ్వ‌న్నెల‌ జెండాను ఆవిష్కరించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ‘ఆంధ్ర‌పాల‌న‌లో ప్రతి రూపాయి అడుక్కునే పరిస్థితి ఉండేది, ఇప్పుడు మ‌న నిధులు మ‌న‌మే ఖ‌ర్చు చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ‌ నియామకాల కోసం అలుపెరుగ‌ని పోరాటాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు కొన‌సాగించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. స్వంత పాల‌న‌లో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తోంద‌ని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఆకలి చావులకు గురయ్యారని కేసీఆర్ అన్నారు. ఆక‌లి చావులు త‌గ్గేలా త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేక కాల‌నీ నిర్మిస్తామ‌ని తెలిపారు. తాము త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల‌ను అనుకున్న ల‌క్ష్యంలోపే పూర్తి చేస్తామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సంపూర్ణ అక్షరాస్యత శాతాన్ని సాధిస్తామ‌ని అన్నారు. పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News