: ఇక సోము వీర్రాజు వంతు!.. బీజేపీ నేతతో ముద్రగడ భేటీ!


కాపులకు రిజర్వేషన్లే లక్ష్యంగా ఉద్యమం చేపట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి వరుస భేటీలతో హోరెత్తిస్తున్నారు. గడువులోగా కాపులకు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన రాకపోతే తాను మరోమారు ఉద్యమించాల్సి వస్తుందని ఆయన ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ముద్రగడ ఉద్యమానికి ఆదిలోనే బ్రేకులు వేయాలని భావిస్తూ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తున్నా. ఏమాత్రం లెక్కచేయని ముద్రగడ తన లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మొన్న హైదరాబాదు వచ్చిన ఆయన పలువురు కాపు ప్రముఖులను కలిశారు. తాజాగా నేటి ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముద్రగడ... తాను రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. అయితే కాపులకు రిజర్వేషన్ల కల్పనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనున్న సర్వేను ముద్రగడ ప్రస్తావించారు. ఈ సర్వే నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News