: ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌కు అస్వస్థత
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన బీపీ, షుగర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతలు, మంత్రులు ఆసుపత్రికి చేరుకొని ఆయనను పరామర్శిస్తున్నారు. మంత్రులు దేవినేని, కామినేనితో పాటు పలువురు నేతలు ఆసుపత్రికి వచ్చి వెంకట్రావ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.