: ఈ జెండా సూపర్... కేసీఆర్ థమ్స్ అప్!


దేశంలోనే అతిపెద్ద జెండాను తెలంగాణలో నెలకొల్పినందుకు అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంచి అభినందనలు దక్కాయి. ఈ ఉదయం నక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కేసీఆర్ అధికారులతో అన్నారు. కేసీఆర్ బటన్ నొక్కగానే, నెమ్మదిగా మువ్వన్నెల జెండా నింగిలోకి చేరడం ప్రారంభం కాగా, తన వద్దకు వచ్చిన అధికారికి కేసీఆర్ బొటనవేలును చూపి 'థమ్స్ అప్' చెప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అతిపెద్ద జెండాను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మిలటరీ బ్యాండ్ 'సారే జహాసె అచ్ఛా', 'ఆజా ఆజా హిందుస్థానీ' వంటి గీతాలను ఆలపిస్తుండగా, జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.

  • Loading...

More Telugu News