: కాగితాల్లో ఏంటి... పని చేసి చూపండి!: మంత్రి గంటాకు చంద్రబాబు క్లాస్!


గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పనితీరుపై చంద్రబాబునాయుడు అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వస్తుండగా, తాజాగా ఆయన తన శాఖకు సంబంధించిన ఓ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించగా, ఆయన దాన్ని విసిరేశారని తెలుస్తోంది. కాగితాల్లో ఏంటి?... పని చేసి చూపాలని క్లాస్ పీకినట్టు కూడా సమాచారం. గత వారంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన వేళ, విద్యాశాఖకు చెందిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కూడా చూపవద్దని చంద్రబాబు ఆదేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ శాఖలో కార్యదర్శి హోదాలో ఉన్న సిసోడియా ఆకస్మిక బదిలీ విషయంలో మంత్రిపై చంద్రబాబు అసంతప్తిగా ఉండటమే కారణమని భావిస్తున్నారు. ఇటీవలి బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో జరిగిన అవకతవకలు, గందరగోళంపై కూడా సీఎం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News