: ఏపీలో గాలి వాన బీభత్సం!...బెజవాడలో కొండచరియలు విరిగిపడి వ్యక్తి దుర్మరణం
మరికాసేపట్లో నవ నిర్మాణ దీక్షలు ప్రారంభమవుతాయనగా... నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నుంచి ఏపీలో గాలి వాన దుమారం రేగింది. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. నవ నిర్మాణ దీక్షకు కేంద్రంగా మారిన విజయవాడలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలివానకు నగరంలోని బెత్లెహాం నగర్ లో కొండచరియలు విరిగి పడి ఓ వ్యక్తి చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు.