: బాబుగారూ... సీటిచ్చినందుకు థ్యాంక్స్!: చంద్రబాబుకు అమిత్ షా ఫోన్!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి సురేశ్ ప్రభుకు రాజ్యసభ సీటిచ్చినందుకు ఆయన చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యసభ సీటిచ్చినందుకు కేవలం థ్యాంక్స్ చెప్పేందుకే చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారు. ఈ మేరకు నిన్న సుదీర్ఘంగా కొనసాగిన కేబినెట్ భేటీలో భాగంగా ఈ అంశాన్ని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు తెలిపారు. ‘‘దేశం మొత్తం మీద బీజేపీ కేవలం ఏపీ వద్ద మాత్రమే సీటు తీసుకుంది. మిగిలిన చోటంతా ఆ పార్టీ బలంతోనే సీట్లను సాధించుకుంది. అమిత్ షా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే సందర్భంగా నేను కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించాను. ఒకసారి ఢిల్లీకి వస్తే అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రధాని వద్ద స్పష్టత తీసుకుందామని అమిత్ షా చెప్పారు’’ అని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News