: బీజేపీలోనే ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యం!... రాజ్యసభ అభ్యర్థుల ఖరారే నిదర్శనం!


దేశంలో హిందూ పార్టీగా పేరుపడ్డ భారతీయ జనతా పార్టీలో ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతోంది. ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొన్నటితో ముగిసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు పూర్తి అయిన తర్వాత... ఆయా పార్టీలు బరిలోకి దింపిన అభ్యర్థులను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమవుతోంది. వచ్చే నెల రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న నేతల్లో బీజేపీకి చెందిన ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఎంజే అక్బర్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఏ తక్, మొహిసినా కిద్వాయ్...బీఎస్పీ నుంచి సలీం అన్సారీ, జేడీయూకు చెందిన గులాం రసూల్ బల్యామీ తదితరులున్నారు. అయితే వీరిలో నక్వీ, అక్బర్ లకు మినహా ఏ ఒక్కరికి కూడా మరోమారు రాజ్యసభ అవకాశం దక్కలేదు. అంటే ఒక్క బీజేపీ మాత్రమే ముస్లిం నేతలను మరోమారు రాజ్యసభకు పంపి... ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటుకుంది. మిగిలిన ఏ ఒక్క పార్టీ కూడా ముస్లిం నేతలను రాజ్యసభకు రెండో మారు పంపేందుకు ఇష్టపడలేదు.

  • Loading...

More Telugu News