: తెలంగాణవ్యాప్తంగా వేడుకలు... ఒక్క ఉస్మానియా వర్సిటీలో మాత్రం నిషేధం!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేడు సంబరాలకు చెక్ పడింది. ఉస్మానియా వర్సిటీలో ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని వర్సిటీ రిజిస్ట్రార్ సురేశ్ కుమార్ ప్రకటించారు. అనుమతి లేకుండా ఎవరైనా ఆవిర్భావ వేడుకలంటూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా వర్సిటీలోకి బయటి వ్యక్తులకు ప్రవేశం లేదని కూడా సురేశ్ కుమార్ ప్రకటించారు. బయటి వ్యక్తులు వర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.