: ‘కామెడీ నైట్స్ బచావో’ కమెడియన్ భారతీసింగ్ కు అస్వస్థత
‘కామెడీ నైట్స్ బచావో’, ‘కామెడీ నైట్స్ లైవ్’ వంటి టీవీ షోల్లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న భారతీ సింగ్ అస్వస్థతకు గురైంది. ఛాతీ నొప్పి రావడంతో ఆమెను ముంబయిలోని సంజీవని ఆసుపత్రికి తరలించారు. నిన్న అస్వస్థతకు గురైందని, ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందుతోందని భారతీసింగ్ కుటుంబసభ్యులు తెలిపారు. చక్కటి టైమింగ్ తో డైలాగ్ లు చెప్పే భారతీ సింగ్ కోలుకోవాలంటూ ఆమె అభిమానులు మెసేజ్ లు పంపుతున్నారు. కాగా, లల్లీగా సుపరిచితురాలైన భారతీ సింగ్, ‘జలక్ దిఖ్ లాజా-5’లో తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.