: 'జేఎన్యూ' ఉదంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజిత్ దోవల్
ఐదు నిమిషాల్లో పాకిస్థాన్ న్యూఢిల్లీని లేకుండా చేయగలిగితే, అదే ఐదు నిమిషాల్లో భారత్ తలచుకుంటే ఏకంగా పాకిస్థాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయగలదని గట్టి వార్నింగ్ ఇచ్చిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పూణేలో జరిగిన యూత్ ఫర్ డెవలెప్ మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎన్యూలో కొంత మంది విద్యార్థులు అఫ్జల్ గురు అనుకూల నినాదాలతో పాటు, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన గర్హించారు. అలా వ్యాఖ్యలు చేస్తే మీరు చూస్తూ ఎలా ఉండగలిగారని ఆయన సమాజాన్ని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు మౌనంగా ఉండడం అంటే దేశాన్ని నాశనం చేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను కేవలం వార్తల కోసం వచ్చిన ఘటనలుగా చూడవద్దని ఆయన సూచించారు. దేశభక్తికి సంబంధించిన విషయంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.